‘సర్కారు వారి పాట’ కథ ఇదేనా..? 

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కంటే ముందు కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

సర్కరు వారి పాట సినిమా కథ ఇదేనంటూ ఓ కథనం వైరల్ గా మారింది… దీని ప్రకారం… ఈ సినిమా కథ భారత బ్యాంకింగ్ రంగం లోని కుంభకోణాలు చుట్టూ తిరుగుతుందట. ఇందులో మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో నటించనున్నాడని.. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన ఓ బిజినెస్ మ్యాన్ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని హీరో ఎలా రాబట్టాడు.. తన తండ్రి మీద పడ్డ అపవాదును ఎలా తొలగించడన్నదే సినిమా కథని తెలుస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు అరవింద్ స్వామి నటించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి తొలుత ఈ పాత్రలో ఉపేంద్రను తీసుకోవాలన్నారు.. కానీ ఉపేంద్ర నో చెప్పడంతో అరవింద్ స్వామిని చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here