మైన‌స్ 35 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద భార‌త్ చైనాను ఎదుర్కోగ‌ల‌దా..

భార‌త్ చైనా మ‌ద్య స‌రిహ‌ద్దులో నెల‌కొన్న వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్కారం అయ్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌రిహ‌ద్దులో రెచ్చిపోతున్న చైనాను బుద్దిచెప్పేందుకు భార‌త్ సిద్ధ‌మైంది. అయితే అక్క‌డ మైన‌స్ 35 సెల్సియ‌స్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు ఉండ‌టమే ఇప్పుడొచ్చిన చిక్కు.

చైనాతో పోరాడేందుకు అన్ని విధాలా భార‌త సైన్యం సిద్ధ‌మే. అందుకు త‌గ్గ ఆయుధాలు, పూర్తి శిక్ష‌ణ గ‌ల సైన్యం భార‌త్‌కే సొంతం. అయితే శీతాకాలం ప్రారంభ‌మైతే ల‌ద్దాఖ్‌లో ప‌రిస్థితులు మ‌న చేతుల్లో ఉండ‌వు. అక్టోబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి మ‌ద్య‌లో తూర్పు ల‌ద్దాఖ్‌లో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 5 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియ‌స్ మేర ఉంటాయి. ఇంత భ‌యంక‌ర‌మైన చ‌లి వాతావ‌ర‌ణం మ‌నం ఊహించుకుంటేనే ఊహ‌ల‌కు అంద‌నిదానిలా ఉంటుంది. అలాంటి చోట భార‌త సైన్యం విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంది.

అయితే ఈ ప‌రిస్థితుల్లో కూడా భార‌త్ చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే వివాదం నెల‌కొన్న ప్రాంతంలో 50 వేల మందికి పైగా సైనికులు ఉన్నారు. వీరి కోసం శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల ట‌న్నుల ఆహారం, క‌మ్యూనికేష‌న్ సాధ‌నాలు, ఇంద‌నం, హీట‌ర్లు అన్నీ చేరిపోయాయి. ఇక యుద్ధానికి సంబంధించిన పెద్ద స‌ఖ్య‌లో టీ 90, టీ 72 ట్యాంకులు, శ‌త‌ఘ్నులు అన్ని ప్రాంతాల్లో త‌ర‌లిపోయాయి.  స్వాతంత్య్రం త‌ర్వాత భార‌త్ చేప‌ట్టిన అతిపెద్ద ఆప‌రేష‌న్ ఇదే అని సైనికాధికారులు తెలిపారు. ల‌ద్దాఖ్ ప్రాంతంలో ఎక్క‌డ చూసినా బారులు తీరిన యుద్ధ విమానాలు, సాయుధ శ‌క‌టాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

సైన్యానికి ఇచ్చేందుకు దుస్తులు, ఇత‌ర వ‌స్తువుల‌ను ఐరోపా దేశాల నుంచి భార‌త్ దిగుమ‌తి చేసుకుంది. తీవ్ర చ‌లిని త‌ట్టుకునేందుకు ప‌లు నిర్మాణాలు సైతం చేప‌ట్టారు. వీటిలో ఇన్సులేష‌న్‌, హీటింగ్ సిస్టం కూడా ఉంటుంది. వంట గ‌దులు, మ‌రుగుదొడ్లు అన్నీ ఇక్క‌డ ఉంటాయి. ఉన్న‌తాధికారుల నుంచి ఆదేశాలు అందిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే స‌రిహ‌ద్దు ప్రాంతం చేరుకొని చైనాను ఎదుర్కొనే సామ‌ర్థ్యం భార‌త ట్యాంకు ద‌ళాల‌కు ఉంది. ఇక అత్యంత చ‌లిలో కూడా ప‌నిచేసే టీ 90, టీ 72 ట్యాంకులు, బీ ఎంపీ 2 ప‌దాతి ద‌ళ సాయుధ శ‌క‌టాలు ఉన్నాయి. ఇక బ‌య‌టి ప్ర‌పంచానికి దూరంగా అస‌లు దేశంలోప‌ల ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌కుండా ఉన్న వీరి కోసం ప్రత్యేకంగా టీవీలు, సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటుచేశారు. ఇలా భార‌త సైన్యం చైనా స‌రిహ‌ద్దులో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోనన్న ఆందోళ‌న‌తో పాటు, ఏం జ‌రిగినా వెంట‌నే స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే శ‌క్తి సామర్థ్యాల‌తో సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here