శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రం ప్ర‌మాదంలో 9 మంది ఏమ‌య్యారు..?

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల‌విద్యుత్ కేంద్రంలో చెలరేగిన మంట‌లు ఆందోళ‌న క‌రంగా మారాయి. విద్యుత్ త‌యారీ కేంద్రంలో అర్ద‌రాత్రి మంట‌ల చెల‌రేగ‌గా సిబ్బంది అదుపు చేయ‌బోయారు. ఈ క్ర‌మంలో మంట‌లు ఎక్కువ అయ్యాయి.

ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ట‌ర్మిన‌ల్‌లో ఈ మంట‌లు వ‌చ్చాయి. అయితే వెంట‌నే అక్క‌డున్న సిబ్బంది బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో కొంద‌రు సేఫ్‌గా బ‌య‌ట‌కు రాగా.. మ‌రికొంద‌రు లోప‌లే ఉండిపోయారు. రాత్రి నుంచి మంట‌ల‌ను అదుపు చేస్తునే ఉన్నారు. కాగా మంట‌ల ద్వారా వ్యాపించిన పొగ మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

లోప‌ల చిక్కుకుపోయిన వారిలో 9 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరి ఆచూకీ ఏమైంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. శ్రీ‌శైలంలో కుడిగ‌ట్టు, ఎడ‌మ గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. కుడి గ‌ట్టు ఆంధ్ర‌ప్రదేశ్‌కి, ఎడ‌మ‌గ‌ట్టు తెలంగాణాకు చెందిన‌వి. అయితే కుడిగ‌ట్టు నుంచి కూడా ఎలాంటి స‌హ‌కారం కావాల‌న్నా వెంట‌నే అధికారులు చెయ్యాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశించారు. కాగా ప్ర‌మాదంలో చిక్కుకున్న వారికోసం తెలంగాణ స‌ర్కార్ రెస్క్యూ టీంను రంగంలోకి దించుతోంది. వారు వ‌స్తే కానీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది పూర్తిగా తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here