నాని “వి” సినిమా ఆస‌క్తిక‌ర విష‌యాలు..

క‌రోనాలో కూడా కచ్చిత‌మైన డేట్ ఫిక్స్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యారు నాని. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న టాక్ మొత్తం వి సినిమా గురించే అయితే సినిమాలో నాని ప‌ర్‌ఫామెన్స్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

వి సినిమా నాని కెరీర్‌లో 25వ సినిమా. ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్ లో న‌టిస్తున్న‌ది తెలిసిందే. అయితే సినిమా సెకండ్ హాఫ్ నుంచి నాని కీ రోల్ మొద‌ల‌వుతుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఈ మేర‌కు చిత్ర యూనిట్ నుంచి ఈ విధ‌మైన లీకులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌స్ట్ హాఫ్ అంతా సుధీర్ బాబుతోనే కంప్లీట్ అవుతుందేమో మ‌రి.

అయితే సినిమా మొత్తం థ్రిల్లింగ్‌గానే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అభిమానులు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్న‌ప్ప‌టికీ థియేట‌ర్ అయితే ఆ మ‌జానే వేరుండేది అని అనుకుంటార‌ట‌. ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించ‌ని స‌న్నివేశాల‌న్నీ సినిమాలో చూపిస్తార‌ని అనుకుంటున్నారు. ఇక మ్యూజిక్ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా ప్రేక్ష‌కుల‌కు విన‌సొంపుగా సినిమా సాగిపోతుంది. మొత్తానికి లాక్‌డౌన్ స‌మ‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వ‌లేదు. దీంతో స్టార్ హీరో నాని క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here