టిడిపి నేత‌లు ఏమ‌నుకుంటున్నారు.. చంద్ర‌బాబుపై త‌మిళ ప‌త్రిక‌లో క‌థ‌నం.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు గురించి ఓ త‌మిళ ప‌త్రిక‌లో వార్త ప్ర‌చురిత‌మైంది. ఇందులో చంద్ర‌బాబు గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల‌తో ఎదురైన ఫ‌లితాల‌పై ఆ పార్టీ నేత‌లు ఏమ‌నుకుంటున్నారో తెలిపింది. జ‌గ‌న్ ఎన్డీయేకు ద‌గ్గ‌ర అవుతుంటే బాబుకి క‌డుపు మంట అని రాసింది.

2014 ఎన్నిక‌ల్లో ఎన్డీయేతో జ‌త‌క‌ట్టి చంద్ర‌బాబు గెలిచారు. ఆ త‌ర్వాత కేంద్రంలో మంత్రి ప‌దవులు సైతం తీసుకున్నారు. అన్ని రోజులు బాగానే ఉండి 2019 స‌మీపిస్తున్న త‌రుణంలో బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ తర్వాత ఎన్నిక‌ల్లో వై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ముందు ఘోర ఓట‌మి చవి చూశారు. అయితే ఆ పార్టీ నేత‌లు ఈ ప‌రిణామాలపై మండిప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళ దిన‌ప‌త్రిక దిన‌మ‌ల‌ర్ ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఏన్ ఇంద వ‌యి ట్రెరిచ్చ‌ల్ అనే పేరుతో అంటే ఎందుకీ క‌డుపు మంట అని తెలుగులో అర్థం.

గ‌తంలో తీసుకున్న తెలివిత‌క్కువ నిర్ణ‌యాల వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని టిడిపి వాళ్లే అనుకుంటున్న‌ట్లు ఆ ప‌త్రిక త‌న క‌థ‌నంలో రాసింది. అప్పుడు ఎన్డీయేతో ఉన్న మంచి అవ‌కాశాన్ని చేజార్చుకొని ఇప్పుడు ఆక్రోశిస్తే ఏం లాభ‌మ‌ని నేత‌లు అనుకుంటున్నారంట‌. వై.ఎస్ జ‌గ‌న్ ఎన్డీయేకు మంచి స‌పోర్టు ఇస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఎన్డీయేలో భాగ‌స్వామి అయ్యి కేంద్ర మంత్రి ప‌ద‌వులు కూడా తీసుకుబోతున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో టిడిపి నేత‌ల మ‌న‌సులోని మాట‌లు బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఈ క‌థ‌నంపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here