బిగ్ బాస్‌లో రమకృష్ణ..?

ఐపీల్ పోటీనీ సైతం తట్టుకుంటూ బిగ్ బాస్ రియాలిటీ షో దూసుకెళుతోంది. అవినాష్ ఎంట్రీతో షోలో నవ్వులు పెరిగాయని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే..  ఈ వీకెండ్ కు నాగార్జున కనిపించట్లేదా..? అంటే అవుననే సమాధానం వస్తుంది.  కరోనా కారణంగా గత ఏడు నెలలుగా షూటింగ్ లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్ర షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లాడు.

మరి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాగార్జున షూటింగ్ లో బిజీగా ఉంటే.. షో పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ శని, ఆది వారాల్లో షో హోస్ట్ గా ఎవరు కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే బిగ్ బాస్ సీజన్ 1,సీజన్ 2 హోస్ట్‌లుగా వ్యవహరించిన ఎన్టీఆర్,  నాని కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దీంతో సీజన్ 3లో గెస్ట్ హోస్ట్ గా వచ్చిన రామకృష్ణనే ఈసారి కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here