నిన్నువ‌ద‌లా అంటున్న సీబీఐ.. న‌న్నేమీ చేయ‌లేవు అంటున్న ఆ ఎంపీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సంబంధించిన వాటిపై ఇటీవ‌ల సీబీఐ అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. కోట్లాది రూపాయ‌లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించ‌కుండా ఉన్నందుకు సీబీఐ కేసు న‌మోదు చేసి ఆ పై దాడులు నిర్వ‌హించింది. అయితే ఇప్పుడు ర‌ఘురామ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

సీబీఐ దాడుల‌ను ఎంపీ ర‌ఘురామ పూర్తి రాజ‌కీయ కోణంగా అభివ‌ర్ణించారు. రాజ‌కీయంగా త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం సాధ్యం అవ్వ‌క‌పోయే స‌రికి సీఎం జ‌గ‌న్ కావాల‌ని త‌న‌పై సీబీఐ కేసు పెట్టించార‌ని అన్నారు. త‌న‌కు రూ. 4వేల కోట్ల లోపు రుణం వ‌చ్చింటే.. అందుకే 2వేల కోట్ల లోపు రుణం ఇంకా డ్రా చేయ‌లేద‌న్నారు. మిగిలిన డ‌బ్బుతో త‌మిళ‌నాడులో 300 మోగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. సీబీఐకి, కోర్టుల‌కు చెప్పుకుంటాన‌న్నారు.

ఇక రోజూ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌భుత్వాన్ని తాను ఇబ్బంది పెడుతున్నందుకు త‌న‌పై ఇలా చేశార‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌ధానిని క‌లిసిన రోజే త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌న్నారు. ఇక ఆత్మ‌హ‌త్య‌కు సిద్దంగా ఉన్న‌వారిని హ‌త్య చేయడం ఎందుక‌ని జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను ఉద్దేశించి ర‌ఘురామ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మండిప‌డుతోంది. అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ దాడులు చేస్తే దీన్ని రాజ‌కీయంగా వాడుకోవ‌డం ఏంట‌ని నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. క‌క్ష్య క‌ట్టి ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్టాల‌న్న ఆలోచ‌న త‌మ‌కు లేదంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here