బిగ్‌బాస్‌4పై విజ‌య్ దేవ‌రకొండ ఏమ‌న్నారంటే..

తెలుగులో బిగ్‌బాస్ షో ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే బుల్లితెర‌పై బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్ ఉంది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ 4 సీజ‌న్ న‌డుస్తోంది. అయితే మ‌రికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ 4 విజేత ఎవ‌రో తెలియ‌నున్నారు.

ఇప్పుడు కేవ‌లం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే బిగ్‌బాస్ షోలో ఉన్నారు. వీరిలో ఎవ‌రు గెలుస్తార‌న్న ఉత్కంఠ ఇటు సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీల్లో కూడా నెల‌కొంది. ప్ర‌ధానంగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్‌బాస్‌4పై ఇంట్ర‌స్టు చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన అభిమాన కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తన స్నేహితుడు అభిజిత్‌కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో విజయ్, అభిజిత్, సుధాకర్ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం), నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం) ఉన్నారు. `మై బాయ్స్‌.. ఎల్లప్పుడూ వారికి మంచే జరగాలి.. ఎక్కడైనా.. ఏమైనా` అంటూ కామెంట్ పెట్టాడు. శేఖర్ కమ్ముల రూపొందించిన `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` సినిమాలో అభిజిత్, సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించగా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి చిన్న చిన్న రోల్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here