ట్రాఫిక్ రూల్స్ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఆ నాయ‌కుడు ఏమ‌న్నారంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలుఇప్పుడు ట్రాఫిక్ చ‌లానాల చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజు ట్రాఫిక్ చ‌లానాల‌పై కామెంట్లు చేస్తున్నారు. ఈయ‌న గ‌త కొద్ది రోజులుగా వైసీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. రోజుకో టాపిక్ ఎంచుకొని రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటారు. నేడు ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడారు.

ట్రాఫిక్ రూల్స్‌పై ఆయన సెటైర్లు వేశారు. మ‌హేష్ బాబు భ‌ర‌త్ అను నేను సినిమాలో లాగా చాలా ట్రాఫిక్ రూల్స్ తెచ్చార‌ని అన్నారు. మీరు విసుక్కున్నా.. కసురుకున్నా.. ఫైన్ వేస్తారన్నారు. మొహం చిట్లిస్తే … 1500… మీరు నవ్వినా ఏసేస్తారు అని ఆయ‌న వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక నుంచి ప్ర‌తి వెహిక‌ల్‌ను పోలీసులు ఆపేస్తార‌ని చెప్పారు. కాగా ట్రాఫిక్ రూల్స్ పెంచిన విష‌యంలో ప‌లువురు ప్ర‌శంసిస్తుంటే మ‌రికొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రూల్స్ మార్చాల‌ని కోరుతున్నారు.

ఇక అమ‌రావ‌తి ఉద్య‌మం గురించి ర‌ఘురామ‌కృష్ణంరాజు మాట్లాడారు. అమరావతిలో రైతుల నిరసన అద్భుతంగా జరిగిందని, పెయిడ్ అర్టిస్టులని అవమానించిన వారికి.. చెంపపెట్టులా రాజధాని రైతులు నిరసన తెలిపారన్నారు. ఉద్యమాన్ని బలపరచాలి.. కానీ కించపర్చొద్దన్నారు. రాజధాని మహిళా రైతుల చీరలు, జాకెట్లపై నీచంగా, హీనంగా, హేళనగా మాట్లాడిన వారిని క్షమించి వదిలేయండమ్మా అని ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఎంపీపై అన‌ర్హ‌త వేటు వేస్తార‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల ఈయ‌న‌కు సంబంధించిన కంపెనీల‌పై సీబీఐ దాడులు జ‌రిగిన త‌ర్వాత కొంచెం గ‌ట్టిగానే ప్ర‌భుత్వంపై దాడి పెంచార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు డిస్క‌ష‌న్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here