ఓటీటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా..

ఇటీవల ఓటీటీ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. బడా బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. దీంతో ఓటీటీ మార్కెట్‌ పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఓటీటీలో వస్తోన్న కంటెంట్‌ను గమనిస్తే కాస్త బోల్డ్ నెస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా బోల్డ్‌ కంటెంట్‌ చూపిస్తున్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి సెన్సార్‌ లేక పోవడమే దీనికి కారణం. అయితే తాజాగా ఇదే అంశంపై తనదైన శైలిలో స్పందించింది నటి కంగనా రనౌత్‌.

ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈరోస్‌ నౌ’.. సల్మాన్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌, కత్రినాకైఫ్‌లతో ఉన్న మీమ్స్‌ ను తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వీటిలో కొన్ని అభ్యంతకర పదాలు ఉండడంతో వాటిని వెంటనే తొలగించేసింది. తాజాగా ఈ వ్యవహారపంపై కంగనా మండిపడింది. తొలగించిన మీమ్‌ ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కంగనా.. ‘సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌లో కళ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ పోర్న్‌ హబ్స్‌ తప్ప మరేమీ కావు’ అంటూ సెన్సేషన్‌ కామెంట్లు చేసింది. మరి కంగనా చేసిన వ్యాఖ్యలు ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here