ఫేస్‌బుక్‌పై రాహుల్ ఏమ‌న్నారంటే..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌ను బీజేపీ..ఆర్ఎస్ఎస్ అదుపుచేస్తున్నాయ‌న్నారు.

అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్ర‌చురిత‌మైంది. ఈమేర‌కు దేశంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని ఆ కథనంలో ప‌త్రిక ప్ర‌స్తావించింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక క‌థ‌నాల‌పై రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈమేర‌కు ట్విట్టర్ ఖాతాలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేశారు.ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విధ్వేష ప్రసంగాలను బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. అయినప్పటికీ వారిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.

కాగా ఈ విద్వేష ప్రసంగాల‌పై కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ ఉద్యోగులతో అధినేత మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడారు. ఇలాంటి కంటెంట్‌పై జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులకు సూచించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో త‌ప్పుడు వార్త‌లు, ధ్వేషాన్ని వ్యాప్తి చేసి ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని రాహుల్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here