హీరో రామ్‌కు షాక్‌..!

సినీన‌టుడు రామ్ ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కారు. విజ‌య‌వాడ‌లోని స్వ‌ర్ణ‌ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆయ‌న స్పందించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టి నుంచి ఆయ‌న ఈ విష‌యంపై స్పందిచ‌బోన‌ని క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ వరుస ట్వీట్లు చేసిన విష‌యం తెలిసిందే. సీఎం జగన్ వెనక భారీ కుట్ర ఉంద‌న్నారాయ‌న‌. సీఎంకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇదంతా చేస్తున్నారని ఆయ‌న ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ల‌తో ఆయ‌న టాలివుడ్‌లోనే కాకుండా ఏపీ రాజ‌కీయాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యారు.

అయితే స్వ‌ర్ణ ప్యాలెస్ ప్ర‌మాదం విష‌యంలో విజ‌య‌వాడ పోలీసులు స్పందించారు. ఈ విష‌యంలో త‌మ‌కు ఆటంకం క‌లిగిస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు పంపిస్తామ‌ని అన్నారు. దీంతో రామ్ మళ్లీ రంగంలోకి దిగారు. అయితే ఇక నుంచి తాను ఈ విష‌యంపై ట్వీట్ చేయ‌బోన‌ని తెలిపారు. న్యాయంపై తనకు నమ్మకముందని, ఎవరైనా, ఎవరికి చెందిన వారైనా నిజమైన దోషులకు శిక్ష పడుతుందన్నారు. దీంతో రామ్ భ‌య‌ప‌డ్డారా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here