టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ మృతి

భార‌త మాజీ క్రికెట‌ర్ చేత‌న్ చౌహాన్ (73) క‌న్నుమూశారు. కోవిడ్ 19 సోకిన ఆయ‌న ఇత‌ర అనారోగ్య కార‌ణాలు తోడై చ‌నిపోయారు.

చేత‌న్ శ‌రీరంలో కొన్ని అవ‌య‌వాలు పనిచేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న మృతిచెందారు. చౌహాన్ క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు పొలిటిక‌ల్ లీడ‌ర్ కూడా. క్రికెట్ అనంత‌రం ఆయ‌న యూపీలోని అమ్రోహా నుంచి 1991, 1998 నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

2018 ఆగష్టు వ‌ర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ క్రీడా మంత్రిగా చేత‌న్ ప‌నిచేశారు. రాష్ట్ర రాజ‌కీయాల‌లో ఆయ‌న చురుకైన పాత్ర పోషించారు. ఇక క్రికెట్ విష‌యానికొస్తే ఇండియాలో ముందు త‌రం క్రికెట్ అభిమానుల‌కు ఆయ‌న తెలిసిన వారే. ఎందుకంటే సునీల్ గ‌వాస్క‌ర్‌తో పాటు ఆయ‌న ఓపెన‌ర్‌గా మ్యాచ్‌లోకి దిగేవారు.

చౌహాన్ భార‌త్ త‌రుపున 40 టెస్టులు, 7వ‌న్డేలు ఆడారు. టెస్టుల్లో 2,084 ప‌రుగులు, వ‌న్డేల్లో 153 ప‌రుగులు ఆయ‌న చేశారు. దిల్లీ క్రికెట్ సంఘంలో ఆయ‌న అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్ష, కార్య‌ద‌ర్శి ప‌ద‌వులు చేప‌ట్టారు. కాగా జులై 12న ఆయ‌న‌కు కోవిడ్ సోక‌డంతో ల‌ఖ్‌న‌వూర్‌లోని సంజ‌య్‌గాంధీ పీజీఐ ఆస్ప‌త్రిలో చేరారు.

ఇత‌ర అనారోగ్య కార‌ణాలు ఉండ‌టంతో గురుగ్రామ్‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ఆయ‌న అవ‌య‌వాలు చికిత్స‌కు స‌హ‌క‌రించ‌క చ‌నిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here