సిరివెన్నెల ఇంట నిశ్చితార్ధ వేడుక

మన టాలీవుడ్ సెల‌బ్రిటీలు లాక్ డౌన్ సమయాన్ని బాగా వాడుకుంటున్నారు. అందరి కన్నా ముందు నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వరుసగా హీరో నిఖిల్‌, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్, న‌టుడు మ‌హేష్, హీరో నితిన్ , దగ్గుబాటి రానా వివాహాలు జరిగాయి. తాజాగా మెగా డాట‌ర్ నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. ఇప్పుడు ఈ ఫిదా న‌టుడి ఇంట పెళ్లి సంద‌డి ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ పాట‌ల‌ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామ‌శాస్త్ర్రి త‌న‌యుడు, న‌టుడు రాజా చెంబోలు నిశ్చితార్థం చేసుకున్నారు.

“ఫిదా” సినిమాలో వ‌రుణ్ తేజ్‌కు అన్న‌య్య‌కు న‌టించిన రాజా త‌న ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ మేర‌కు ఫొటోల‌ను షేర్ చేస్తూ “ఇది 2020లోనే బెస్ట్ పార్ట్‌. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృత‌జ్ఞ‌త‌లు” అని రాసుకొచ్చారు. రాజా..’నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’‌, ‘అంత‌రిక్షం’, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’, ‘ర‌ణ‌రంగం’ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here