ఏపీకి మరో రికార్డ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో రికార్డ్ సాధించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు జగన్. ఇప్పుడు ప్రపంచం రాష్ట్రంవైపు చూసేలా చేశారు.

వైఎస్ జగన్ అధికారం చేపట్టగానే రాష్ట్రంలో ఆయన తరహా పాలన ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రతి గ్రామానికి, పట్టణాల్లో వార్డుకు సచివాలయం ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయంలో వివిధ రకాల సేవలు ఎలా ఉండేవో గ్రామ సచివలయాల్లో కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందేలా సచివాలయాల్లో విభాగాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామంలోని ప్రజలు తమకు అవసరమైన సేవలన్ని ఇక్కడే పొందుతున్నారు.

ఇక వాలంటీర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సేవలన్ని ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చారు జగన్. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏపీలో గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థపై దృష్టి సారించింది. దీంతో సచివాలయ సేవలకు సహకారం అందించడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలు ముందుకు వస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, గ్రామ వార్డు సచివాలయ శాఖల మధ్య చర్చలు జరుగనున్నాయి. వీటిలో సచివాలయం ద్వారా అందుతున్న సేవలు.. అందించాల్సిన సహకరంపై ఇరువురు మాట్లాడనున్నారు. అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అట్టడుగు స్థాయిలో ప్రజలందరికి సమానంగా అందజేయలన్న లక్ష్యంతో వైఎస్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశములోని గుర్తింపు తెచ్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here