మోదీ క్వారంటైన్‌కు వెళ్లాలి..

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని శివ‌సేన పార్టీ ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. అయోధ్య భూమి పూజ‌లో రామ జ‌న్మభూమి చీఫ్ మ‌హంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. దీంతో శివ‌సేన ఈ వ్యాఖ్య‌లు చేస్తోంది.

ఈనెల 5వ తేదీన అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయోధ్య భూమి పూజలో పాల్గొన్న రామ‌జ‌న్మ‌భూమి చీఫ్‌ మహంత్ నృత్య గోపాల్ దాస్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ప‌డిన ఆయ‌న‌కు ఈనెల 13వ తేదీన క‌రోన నిర్దార‌ణ అయ్యింది. అయితే అయోధ్య కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని శివ‌సేన ఎంపీ సంజయ్ అన్నారు.

మ‌హంత్ నృత్య గోపాల్ దాస్ చెయ్యిని కూడా మోదీ పట్టుకున్నార‌న్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిన నేప‌థ్యంలో మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల‌న్నారు. మోదీ కోవిడ్ నిబంధ‌న‌లు ఎందుకు పాటించ‌డం లేద‌న్నారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టింద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here