ప‌వ‌ర్‌స్టార్ మ‌రో రికార్డ్‌..?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో రికార్డు సృష్టించేందుకు రెడీగా వున్నారు. మునెపెన్న‌డూ లేని విధంగా ప‌వ‌న్ పేరిట రికార్డు నెల‌కొల్పేందుకు అభిమానులు సిద్ధ‌మవుతున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే వ‌స్తుందంటే చాలు అభిమానులు సంద‌డి చేసేస్తారు. అలాంటిది ఈ సారి ఇప్ప‌టినుంచే ఇందుకోసం భారీ ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 2 ప‌వ‌ర్ స్టార్ బర్త్ అన్న విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం సాయంత్రం ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డే సిడిపిని ఆయ‌న అభిమానులు విడుద‌ల చేశారు. హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్ట‌ర్లో హోరెత్తిస్తున్నారు.

ఇక ఈ హ్యాష్‌ట్యాగ్‌కు మూడు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప‌ది మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికే 40 మిలియ‌న్ వ్యూస్ రీచ్ అయ్యింద‌ని.. 24 గంట‌ల్లో 70 మిలియ‌న్ వ్యూస్‌ను రీచ్ కావ‌డానికి ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల ప్రిన్స్ మహేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్బంగా #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు.

#HBDMaheshBabu ట్యాగ్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఏకంగా 24 గంటల్లో 60.2 మిలియన్లకు పైగా ట్వీట్లు చేశారు. అయితే ఇప్పుడు ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here