ఏమిటీ రాజ‌కీయాలు చంద్ర‌బాబూ.. తిరుప‌తిలో ఏం చేస్తున్నారో అర్థ‌మ‌వుతోందా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నారా అంటే క‌చ్చితంగా అవున‌నే స‌మాధానాలే వినినిస్తున్నాయి. అయితే ఎవ‌రు ఇలాంటి రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారంటే ముందుగా వినిపించే పేరు చంద్ర‌బాబు నాయుడు. ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్‌కు భారీ మెజార్టీ ఉంది. ఇప్ప‌ట్లో ఆయ‌న్ను వ‌దుల‌కొనే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం..

ఇటీవ‌ల తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గ ప్ర‌సాద్ చ‌నిపోయారు. క‌రోనా సోకిన ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటుండ‌గా గుండెపోటు రావ‌డంతో మృతిచెందారు. దీంతో తిరుప‌తిలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వ‌హిస్తారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎంపీ చ‌నిపోయారు కాబ‌ట్టి ఆ స్థానం ఏక‌గ్రీవం అవ్వ‌డం సాంప్ర‌దాయం. అయితే ఈ ఎన్నిక‌ల్లో పోటీ పెడతామ‌ని బీజేపీ ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. దీంతో, జ‌న‌సేన బీజేపీ క‌లిసి పోటీ చేస్తాయ‌ని అంతా అనుకుంటున్నారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డే చంద్ర‌బాబు రాజ‌కీయం మొద‌లు పెట్టిన‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయ‌డం లేదు. అయితే ఆయ‌న మ‌ద్ద‌తు మొత్తం బీజేపీ, జ‌న‌సేన అభ్య‌ర్థికే ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెలుస్తోంది. ఈమేర‌కు బీజేపీ నేత‌ల‌తో ఆయ‌న మాట్లాడేందుకు సిద్ధ‌మైనట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా ఇప్ప‌టికే బీజేపీకి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు నాయుడు.. ఈ ఉప ఎన్నిక‌ల్లో స‌పోర్టు ఇచ్చి ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి బీజేపీ ఏ మాత్రం ఒప్పుకుంటుందో చూడాలి. కేంద్రంలో న‌రేంద్ర మోదీతో ఇటీవ‌ల జ‌గ‌న్ సంబంధాలు మెరుగైన ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఎలాగైనా బీజేపీ పెద్ద‌ల‌తో స‌ఖ్య‌త‌గా మెల‌గాల‌ని భావిస్తున్నారు. అందుకే ఏ చిన్న అవ‌కాశం దొరికినా వ‌దులుకొనేందుకు సిద్ధంగా లేరు. దీనిలో భాగంగానే ఉప ఎన్నిక‌ల్లో బ‌య‌ట‌కు పోటీ పెట్ట‌బోమ‌ని చెబుతూనే లోలోప‌ల బీజేపీతో పొత్తు పెట్టుకొని మ‌ద్దతు ఇచ్చేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక‌వ్వ‌డంతో రాష్ట్రంలో దీనిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. అధికార పార్టీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ చ‌నిపోయిన ప‌క్షంలో ఆ పార్టీ నేత‌లే ఏకగ్రీవంగా ఎన్నిక‌వ్వ‌డం మ‌నం ఇదివ‌ర‌కూ చూశాం. అయితే ఇలాంటి సాంప్ర‌దాయాన్ని మంట క‌లిపి… నీతిమాలిన రాజ‌కీయాలు చేయ‌డం ఏంట‌ని అంతా చర్చించుకుంటున్నారు.

గ‌తాన్ని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. క‌ర్నూలు జిల్లా ఆళ్ళ‌గ‌డ్డ ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి వైసీపీ త‌రుపునే గెలిచి టిడిపిలోకి వెళ్లారు కాబ‌ట్టి జ‌గ‌న్ అప్పుడు ఆళ్ళ‌గ‌డ్డ ఉప ఎన్నిక‌లో పోటీలో పెట్టారు. ఇక కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే అక్కడ ఉప ఎన్నిక‌లో వైసీపీ పోటీ చేయ‌లేదు. కావున ఇక్క‌డ కూడా వైసీపీ ఎంపీ చ‌నిపోయారు కాబట్టి ఎవ్వ‌రూ పోటీలో ఉంచ‌కూడ‌దు. కానీ బీజేపీ పోటీలో పెడ‌తామ‌ని చెబుతోంది. అయితే 40 ఏళ్ల రాజ‌కీయం సీనియ‌ర్ నాయ‌కుడిన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు సిట్టింగ్ ఎంపీ చ‌నిపోతే ఆ పార్టీకే ఆ సీటు వ‌దిలిపెట్టాల‌న్న రాజ‌కీయం తెలియ‌దా అని అంతా అనుకుంటున్నారు. చంద్ర‌బాబు ఎంత‌కైనా దిగ‌జారి రాజ‌కీయాలు చేస్తార‌న‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఇంకోటి లేద‌న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here