రామ్ గోపాల్ వర్మ ని చంపేస్తాం ..

సర్కార్ 3 సినిమా విడుదల కి సిద్దం అవుతున్న టైం లో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తో సినిమాలు చేస్తూనే ఉంటాను అనీ ప్లాపు వచ్చిన హిట్టు వచ్చినా తనకి ఎలాంటి ఇబ్బందీ లేదు అనడం తెలిసిన విషయమే. డబ్భై ఏళ్ళ వయసులో కూడా ఖాళీ లేకుండా బతుకుతున్నారు అమోతాబ్ బచ్చన్. వర్మతో సర్కార్ త్రీ తీసి అతిపెద్ద ప్లాప్ ని మూట గట్టుకున్నారు ఆయన. గతంలో ‘ఆగ్’.. ‘నిశ్శబ్ద్’.. ‘రణ్’.. ‘డిపార్ట్ మెంట్’ లాంటి సినిమాలతో బిగ్-బికి చేదు అనుభవాలు మిగిల్చాడు వర్మ.

ఆగ్ సినిమా అయితే రామూ కెరీర్ కే అతి వరస్ట్ సినిమాగా పేరుంది. తాజాగా వచ్చిన సర్కార్ 3  సినిమాకి కేవలం రెండున్నర కోట్లు మాత్రమె వచ్చాయి. బిగ్ బీ తో ఇంకొక సినిమా తీసావ్ అంటే చంపేస్తాం అంటూ రామ్ గోపాల్ వర్మ కి అమితాబ్ ఫాన్స్ బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారు అని వినిపిస్తోంది . రామూ బృందం లో ఒకరు ఈ విషయం కన్ఫిరం చేసారు. మొదట ఇది ప్రాంక్ కాల్ అనుకున్నారు కానీ ఆ తరవాత నిజంగానే ఒక నలుగురు ఐదిగురు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here