నిఖిల్ సిద్దార్థ్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు :

తెలుగు చిత్రాల్లో సీక్వెల్ పార్ట్ లు ఎప్పుడూ హిట్ అవ్వలేదు. కానీ కార్తికేయ టీం మాత్రం అదే ప్రయత్నం తో వస్తోంది. ప్రేమం సినిమా తరవాత చందూ మొండేటి కి అనేక ఆఫర్లు వచ్చినా సరే కార్తికేయ స్టోరీ ని కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశ్యం తోనే ఉన్నాడట ఆ డిరెక్టర్ . నిఖిల్ సిద్దార్థ్ కి స్టోరీ చెప్పగా అది సూపర్ అని మెచ్చుకోవడం వెంటనే చేద్దాం అనడం అన్నీ వెంట వెంటనే అయిపోయాయి వేరే స్క్రిప్టులన్నీ పక్కన పెట్టేసి ‘కార్తికేయ-2’ మీదే పని చేస్తున్నాడట చందూ. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

బాహుబలి తప్ప తెలుగులో ఒక్క సినిమా కూడా సీక్వెల్ హిట్ అయ్యిందే లేదు అలాంటి సెంటిమెంట్ ని కూడా పక్కన పెట్టేసి నిఖిల్ ఈ రిస్క్ తీసుకుంటున్నాడు అంటే పెద్ద విషయమే అని చెప్పచ్చు. కార్తికేయ సీక్వెల్ అంటే కేవలం ఆ పేరు వాడుకోవడం కాదని.. దీనికి 100 శాతం సీక్వెల్ లక్షణాలుంటాయని.. ‘కార్తికేయ’ ఎక్కడైతే ముగిసిందో అక్కడే ఈ చిత్రం మొదలవుతుందని నిఖిల్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here