” బీజేపీ తో రజినీకాంత్ కలిస్తే కొంప మునుగుతుంది “

రజినీకాంత్ – స్టాలిన్ ల విషయం లో కొత్త ప్రశ్నలు ఉదయిస్తునట్టు కనిపిస్తున్నాయి. రజినీకాంత్ ని రాజకీయాలలోకి రప్పించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ పార్టీ అని అందరూ అనుకుంటున్నా నేపధ్యం లో స్టాలిన్ ని రజిని తన సోదర సమానుడు , స్నేహితుడు అని చెప్పడం మరొక కొత్త ప్రశ్న ని లేపుతోంది. డీఎంకే తో రజినీకాంత్ కలుస్తారా అంటూ తమిళ మీడియా అనేక ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఈ లోగా రజినీకాంత్ మాటలకి స్టాలిన్ సమాధానం చెప్పారు. తనను స్నేహితుడిగా భావించినందుకు రజనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

రాజకీయ ప్రవేశంపై రజనీ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని… తమిళనాడులో పాగా వేయాలని ఆ పార్టీ చూస్తోందని అన్నారు. ” బీజేపీ కి మేము సపోర్ట్ చేసే పరిస్థితి లో లేము . అలాగే రజినీకాంత్ ని కూడా బీజేపీ వైపు మొగ్గు చూపించద్దు అని చెప్పాలి అనుకుంటున్నాం … ఒక నేషనల్ పార్టీ కి తమిళులు ఓటు వెయ్యరు “.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here