పీఎం మోడీకి దగ్గరవుతున్న వైఎస్ జగన్

కేంద్రంలోని ఎన్డీఎలో చీలికలు వచ్చాయా ? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతోందా ? 2019 ఎన్నికల్లో…ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీ సొంతంగా పోటీ చేయనుందా ? అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్  ప్రిపేర్ చేసుకుంటోందా ? తాజా పరిణామాలు చూస్తుంటే….అవుననే సమాధానం వినిపిస్తోంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…వచ్చే ఎన్నికల్లో జగన్ తో దోస్తికి సిద్ధమవుతున్నారా ? అందులో భాగంగానే చంద్రబాబును దూరం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జగన్ కు అడగ్గానే అపాయింట్ మెంట్  ఇచ్చిన మోడి….అయితే చంద్రబాబుకు మాత్రం అపాయింట్ మెంట్  ఇవ్వలేదు. దీనికి తోడు జగన్ తో ఏకంగా గంటపాటు చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగనుందా ? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కామెంట్స్  వెనుకున్న అంతర్యమేంటీ ? పొత్తుల్లేకుండా పోటీ చేసి….సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాదిలో  కమలం జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే…పార్టీ బలపడదనే ఉద్దేశంతో కాషాయం నేతలు జగన్ తో దోస్తీకి సై అన్నట్లు సమాచారం.
వైసీపీ అధినేత జగన్ …ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని కలిసిన తర్వాత జోష్ పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఎకు మద్దతిస్తామని ప్రకటించారు జగన్ . అదే సమయంలో టీడీపీ నేతలు… మోడి, జగన్  కలయికను జీర్ణించుకోలేకపోయారు. కేసులకు భయపడే ప్రధాన మంత్రిని కలిశారంటూ ఆరోపణలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here