తెలంగాణ త‌ర‌హాలో ఏపీలో కూడా గెలుస్తాం… బీజేపీ నేత‌ సోము వీర్రాజు..

బీజేపీ తెలుగు రాష్ట్రాలలో మంచి జోష్ మీద ఉంది. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణలోని హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గానే బీజేపీ కైవ‌సం చేసుకుంది. అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏపీపై కూడా ఇదే త‌ర‌హాలోనే ప్ర‌ణాళిక‌లు వేయాల‌ని బీజేపీ చూస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కామెంట్ చేశారు.

తెలంగాణ.. అటు ఏపీ కమలనాథులు, కార్యకర్తల్లో ధీమా పెరిగింది. తాజాగా తెలంగాణ‌ ఫలితాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ- జనసేన కూటమి గట్టి పోటీ ఇస్తామని తెలిపారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ- జనసేన కూటమి అధికారం చేపడుతుందన్నారు. మోదీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేంద్రం ఏపీ కి 24 లక్షలు ఇళ్ళు ఇస్తే వైసీపీ ప్రభుత్వం 17 లక్షలు ఇళ్ళు మాత్రమే తీసుకుంది.

ఎనిమిది లక్షల ఇళ్ళు వెనక్కిపోయాయని తెలిపారు. జలమిషన్ ద్వారా కేంద్రం రూ.79 లక్షలు కుళాయిలు ఇస్తే కేవలం రూ. 39 లక్షలు కుళాయిలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రం ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఎన్నికల కమీషనర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు వేల ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఇచ్చేశారు. నామినేషన్‌లు వేయకుండా చేశార‌న్నారు. ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here