హ‌నీమూన్ త‌ర్వాత షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న కాజ‌ల్‌..

ప్ర‌ముఖ హీరోయిన్ కాజ‌ల్ ఇటీవ‌లె పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె హ‌నీమూన్‌కు కూడా వెళ్లారు. కాజ‌ల్ చేస‌కున్న వ్య‌క్తి ఎవ‌రో కాదు ఆమె చిన్న‌నాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. హ‌నీమూన్‌లో ఉన్న కాజ‌ల్ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు.

కాజల్‌ భర్త గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బిజినెస్‌ వ్యవహారంలో ఇప్పుడు భర్తకు తోడుగా కాజల్‌ కూడా చేరింది. గౌతమ్‌ కిచ్లుకి సంబంధించిన ఇ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి కాజల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2.. డీకే దర్శకత్వంలో ఓ హారర్‌ మూవీలో కాజల్‌ నటించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here