రాజీవ్ రికార్డులు.. మోదీ, రాహుల్ నివాళులు

దివంగ‌త నేత‌, మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్‌గాంధీ జ‌యంతికి ప‌లువురు నివాళుల‌ర్పించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న కు ఘ‌నంగా నివాళి అర్పించారు.

1944 ఆగ‌ష్టు 20వ తేదీన ముంబైలో రాజీవ్‌గాంధీ జ‌న్మించారు. 40 ఏళ్ల‌కే అంటే 1984లోనే ఆయ‌న భార‌త ప్ర‌ధాని అయ్యారు. అతి చిన్న వ‌య‌స్సులో ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిగా ఆయ‌న రికార్డు సాధించారు. నేడు రాజీవ్ గాంధీ 76వ జ‌యంతిని జాతి జ‌రుపుకుంటోంది.

ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీల సంతాన‌మైన రాజీవ్‌గాంధీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్ద‌రు సంతానమ‌న్న విష‌యం తెలిసిందే. దేశ రాజ‌కీయాల్లో మ‌ర్చిపోలేని కుటుంబం వీరిది. 1989 డిసెంబ‌ర్ 2వ‌ర‌కు రాజీవ్ ప్ర‌ధానిగా ప‌ని చేశారు. 1991లో త‌మిళ‌నాడులోని ఎన్నిక‌ల ర్యాలీలో రాజీవ్ చ‌నిపోయారు.

నేడు రాహుల్ గాంధీ రాజీవ్‌కు నివాళి అర్పించారు. రాజీవ్‌గాంధీ గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి అన్నారు. ఇలాంటి వ్య‌క్తికి కొడుకుగా పుట్ట‌డం గ‌ర్వ‌ప‌డుతున్నాన‌న్నారు. భావోద్వేగంగా రాహుల్ మెసేజ్ చేశారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా రాజీవ్ గాంధీ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న్ను గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here