హోంమంత్రిపై మండిప‌డ్డ అయ్య‌న్న‌పాత్రుడు

ఏపీ హోమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌పై మాజీ మంత్రి టిడిపి నేత అయ్య‌న్న‌పాత్రుడు మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి లేఖ రాస్తే మీకు బాధెందుకు అన్నారు.

ఇక రాష్ట్రంలో స్టేట్ గెస్ట హౌస్‌లు క‌ట్టేందుకు ప్ర‌భుత్వం ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై అయ్య‌న్న పాత్రుడు మాట్లాడుతూ నాలుగు ప్రాంతాల్లో 30 ఎక‌రాల్లో ప్ర‌భుత్వ అతిథి గృహాలు క‌డుతున్నార‌ని. తిన‌డానికి తిండి లేక‌పోయినా మీసాల‌కు సంపంగి నూనె అన్న‌ట్లు ప్రభుత్వ ప‌నితీరు ఉంద‌న్నారు.

మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు అని అయ్య‌న్న‌పాత్రుడు చెప్పారు. చంద్ర‌బాబును విమ‌ర్శించే స్థాయి మీకు ఉందా అని మంత్రిని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక వేళ విమ‌ర్శిస్తే కూడా సంస్కార‌వంతంగా స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇక రాజ‌కీయాల్లో పొగ‌డ్త‌లు, విమ‌ర్శ‌లు రెండూ ఉంటాయ‌న్నారు.

కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ రాస్తే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నార‌న్నారు. రాష్ట్రంలో ద‌ళిత యువ‌కుడిని స్టేష‌న్లో శిరోముండ‌నం చేశార‌న్నారు. గుంటూరులో ఐదు సంవ‌త్స‌రాల ద‌ళిత బాలిక‌పై అత్యాచారం జ‌రిగింద‌న్నారు. చిత్తూరులో ప్ర‌భుత్వ మ‌హిళా డాక్ట‌రుపై వేధింపులు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దిశ చ‌ట్టం ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ద‌ళితుల‌పై దాడులు జ‌రిగితే మాట్లాడ‌ని హోమంత్రి.. ఇప్పుడు చంద్ర‌బాబు విషయంలో మాట్లాడుతున్నార‌న్నారు.

కాగా అయ్య‌న్న‌పాత్రుడు కామెంట్స్‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబు ప్ర‌పంచ స్థాయిలో నిలిచిపోవాల‌ని చూస్తే లేనిది.. రాష్ట్ర ప్ర‌భుత్వం అతిథి గృహాలు క‌డితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌ముఖులు రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు బ‌స చేసేందుకు శాశ్వ‌తంగా గెస్ట్ హౌస్‌లు నిర్మించాల‌నుకోవ‌డం మంచి నిర్ణ‌య‌మే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here