ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్ర హోంశాఖ ప‌రిధిలోనే

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతూనే ఉంది. త‌న ఫోన్ కూడా ట్యాప్ చేశార‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అంటున్నారు. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న ఫోన్ ట్యాప్ చేశార‌ని సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు అన్నారు. ర‌చ్చ‌బండ పేరుతో ఈయ‌న ప్ర‌తి రోజూ తాజా రాజ‌కీయాల‌పై మాట్లాడుతున్నారు. నేడు ఫోన్ ట్యాపింగ్‌పై ఆయ‌న మాట్లాడారు. త‌న ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో త్వ‌ర‌లోనే తెలిసిపోతుంద‌న్నారు. అధికారులు చేశారా అన‌ధికారులు చేశారా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్నారు.

ఇక జీ.వీ.ఎల్ ను ఉద్దేశించి కూడా ర‌ఘురామ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై వ్య‌క్తి గ‌తంగా క్లారిటీ ఇస్తున్నాన‌న్నారు. ఇది కేంద్ర హోంశాఖ ప‌రిధిలోని అంశం అన్నారు. జాతీయ పార్టీకి వివిధ అభిప్రాయాలు ఉంటాయ‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. గ‌తంలో ఎంపీ శోభ క‌రంద్లాజే కూడా ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖ‌కే తెలిపారని గుర్తు చేశారు. ఇక త‌న ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో త్వ‌ర‌లో తెలుస్తుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here