జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం

రాష్ట్రంలో ప్ర‌జ‌ల అభివృద్ధే ధ్యేయంగా అధికారం చేప‌ట్టిన వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ ఆదిశ‌గానే అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ ముందుకు వెళుతున్న జ‌గ‌న్ మ‌రో కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తున్నారు.

వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప‌థ‌కం ద్వారా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు, బాలింత‌లు,  గ‌ర్బిణిల ఆరోగ్య‌మే ల‌క్ష్యంగా వారికి పౌష్టికాహారం అందించేందుకు ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. ఇందుకోసం ప్ర‌భుత్వం ఏడాదికి 1900 కోట్లు కేటాయించ‌నుంది. దీంతో పాటు జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కానికి కూడా కేబినెట్ ఆమోదం పొందింది.

వ‌చ్చే నెల 5వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంది. ఇక మ‌రో ప‌థ‌కం  వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కం ద్వారా ఏపీలోని కోటి మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు నాలుగేళ్ల‌లో 27వేల కోట్ల రూపాయ‌లు అంద‌నున్నాయి. 2019 ఎన్నిక‌ల నాటికి  డ్వాక్రా సంఘాల‌కు ఉన్న బ‌కాయిల‌న్నింటినీ నాలుగు విడ‌త‌ల్లో తిరిగి వారికి చెల్లిస్తామ‌ని చెప్పారు. అందులో భాగంగానే వ‌చ్చే నెల 11వ తేదీన వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు.

ఈ ప‌థ‌కం ద్వారా మొద‌టి ద‌ఫా కింద రూ. 6,750 కోట్ల రూపాయ‌లు మ‌హిళ‌ల‌కు అంద‌నుంది. ఇక సెప్టెంబ‌ర్ 5వ తేదీన పాఠ‌శాల‌లు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here