మీరు బీజేపికి ఎందుకు మ‌ద్ద‌తిచ్చారో మాకు తెలుసు..

పార్ల‌మెంటులో వ్య‌వ‌సాయ బిల్లుల చ‌ర్చ సందర్బంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చోటుచేసుకున్నాయి. రాజ్య‌స‌భ‌లో బిల్లుకు వైసీపీ మద్ద‌తు ఇచ్చిన విష‌యం తెలిసింతే. అయిదే కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు బిల్లును వ్య‌తిరేకించాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇరు పార్టీల నేత‌ల‌కు మద్య మాట‌ల యుద్ధం న‌డించింది.

బిల్లుపై చ‌ర్చ సంద‌ర్బంగా మాట్లాడిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్య‌లు చేయ‌డంపై కాంగ్రెస్ మండిప‌డింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాల‌నే ఎన్‌.డి.ఏ బిల్లు రూపంలో తీసుకొచ్చిన‌పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన వారంతా రైతు శ్రేయోభిలాషుల‌ని.. వ్య‌తిరేకించ‌న వారంతా ద‌ళారుల ప‌క్ష‌మ‌ని అంటూనే కాంగ్రెస్ ద‌ళారుల ప‌క్ష‌పాతి అని వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై కాంగ్రెస్ మండిప‌డింది.

కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన భాష బాగోలేద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. బిల్లుపై మాట్లాడిన‌ప్పుడు స‌భ్యుడి ప్ర‌వ‌ర్త‌న అభ్యంత‌ర‌కరంగా ఉంద‌ని దీనిపై పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ లేవ‌నెత్తుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ అన్నారు. గులాం న‌బీ ఆజాద్ మాట్లాడుతూ కోట్ల‌కు కోట్లు దోపిడీ చేసి జైలుకు వెళ్లారు. ఎవ‌రైతే అవినీతి కార‌ణంగా జైలుకు వెళ్లారో అని విజ‌యసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీరు బెయిల్‌కు అర్హుడు కాద‌న్నారు. తిరిగి అదేస్థానానికి పంపుతామ‌న్నారు. బీజేపీకి మీరెందుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారో మాకు తెలుస‌న్నారు. మొత్తానికి బిల్లుల సంద‌ర్బంగా బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య మాటల యుద్ధం జ‌ర‌గ‌డం మామూలే. అయితే విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల కార‌ణంగా ఇలా దుమారం రేగింద‌ని సభ్యులు మాట్లాడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here