రేణు ఇజ్ బ్యాక్..

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి రేణు దేశాయ్. అనంతరం కేవలం కొన్ని చిత్రాల్లో నటిగా కనిపించి తెర వెనక్కి వెళ్లిపోయారు రేణు. అనంతరం నిర్మాతగా, దర్శకురాలిగా తెర వెనక ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ఇష్క్ వాలా లవ్అనే సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా..  రేణులో మంచి మూవీ మేకర్ ఉన్నారని ప్రపంచానికి తెలిసింది.

https://www.instagram.com/p/CFWDCfThgEm/

ఇదిలా ఉంటే ఇన్నాళ్లు తెర వెనుక ఉంటూ వస్తున్న రేణుదేశాయ్.. త్వరలో మళ్లీ కెమెరా ముందు దర్శనమివ్వనున్నారు. తాజాగా వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు రేణుదేశాయ్ స్వయంగా ప్రకటించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఫోటో షూట్ కోసం తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఇటీవల ఒక మంచి సిరీస్ కు సైన్ చేశా. నిజం, న్యాయం కోసం పోరాడే బలమైన మహిళ కథ ఇది. ఇందులో నేనొక అందమైన పాత్రను చేయబోతున్నాను. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. వెబ్ సిరీస్ కు ఎమ్. ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. మరి నెల తర్వాత తెరపై కనిపించనున్న రేణు దేశాయ్ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here