స‌రిహ‌ద్దులో 3 వేల బ‌లగాలు పెంచిన చైనా.. ధీటుగా స‌మాధానం చెబుతున్న భార‌త్.

భార‌త సైన్యం దూకుడు పెంచింది. స‌రిహ‌ద్దులో ఆక్ర‌మ‌ణ‌లు చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్న చైనాకు షాక్ ఇస్తోంది. తాజాగా ఆరు శిఖ‌రాల‌ను భార‌త్ స్వాధీనం చేసుకుంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే మూడు వేల బ‌ల‌గాల‌ను తీసుకొచ్చి చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్పడుతూనే ఉంది.

ల‌ద్దాఖ్‌లో స‌రిహ‌ద్దు వద్ద భార‌త సైన్యం ఆరు శిఖ‌రాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుంది. 20 రోజుల్లో వీటిని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. దీంతో పాటు 20 ప‌ర్వ‌త ప్రాంతాల్లో భార‌త్ బ‌ల‌గాల‌ను పెంచేసింది. స‌రిహ‌ద్దులో చైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న త‌రుణంలో భార‌త్ ధీటుగా స‌మాధానం చెప్పే ప‌నిలో ఉంది. బోర్డ‌ర్‌లో చ‌లి తీవ్ర‌త పెరుగుతున్నా భార‌త్ సైన్యం మాత్రం సైన్యాన్ని త‌ర‌లిస్తూనే ఉంది. వీటితో పాటు భార‌త సైన్యంలోకి కొత్త‌గా చేరిన ర‌ఫెల్ యుద్ద విమానాలు గ‌స్తీ తిరుగుతూ ఉన్నాయి.

ఇక చైనా సైనిక శిఖ‌రాల‌పై అవస‌ర‌మైన‌ప్పుడు పై చేయి సాధించేందుకు భార‌త్ చాలా ఎత్తైన శిఖరాల‌పై బ‌ల‌గాలను ఉంచింది. ఎత్తైన శిరాల్లో తిరుగుతూ ఉండ‌టం భార‌త సైన్యానికి ఎప్ప‌టినుంచో అల‌వాటు ఉన్న ప‌ని. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ సైనికులు ఎలాంటి పరిస్థితుల‌పైనా ఎదుర్కొనే శ‌క్తి ఉంది. ఇటీవ‌ల చైనా పాంగాంగ్ ద‌క్షిణ తీరంలోని థాకుంగ్ ప్రాంతంలో శిఖ‌రాలను ఆక్ర‌మించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ స‌మ‌యంలో గాల్లోకి మూడు సార్లు కాల్పులు కూడా జ‌ర‌పింది. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు భార‌త సైన్యం చేతుల్లోకి వ‌చ్చేసింది. దీంతో స‌మీప ప్రాంతానికి 3వేల బ‌లగాల‌ను చైనా తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here