పద్మావతి మీద యుద్ధం మొదలైంది

దేశంలో అనేక వివాదాలను సృష్టించిన సినిమా పద్మావతి సినిమా. ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా విడుదలకు ముందు సెన్సార్కి వెళ్లక ముందు ఎన్నో కష్టాలను  ఎదుర్కొంది పద్మావతి సినిమా. అయితే ఈ క్రమంలో పద్మావతి సినిమా నిర్మాతలు ఎంతో కష్టపడి జనవరి 26న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే గతంలో ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన చేసిన కర్ణి  సేనలు సినిమా రిలీజ్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

కానీ సెన్సార్ అందుకున్న తరువాత సినిమా ఏ వివాదాలకు తావివ్వకుండా రిలీజ్ కాబోతోంది అని అందరు అనుకున్నారు. ప్రెస్ షోలు కూడా కొన్ని ప్రదర్శించబడ్డాయి.అయితే కర్ణి సేన కార్యకర్తలు ఎవరు ఊహించని విధంగా పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. థియేటర్ల పై దాడులు చేశారు. నిప్పు అంటించి ఆస్థి నష్టం కలిగించారు. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో ఉన్న 150 వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.ఉత్తర భారతములో కొన్ని రాష్ట్రాలలో హిందూ సంఘల ఆందోళనలు తార స్థాయికి పెరిగిపోయాయి. దీంతో పలు చోట్ల పోలీసులు 144 సెక్షన్ ను అమలుపరిచారు. ఇక కొన్ని థియేటర్స్ ముందు పద్మావత్ సినిమా ప్రదర్శించడం లేదనే బోర్డులు దర్శనం ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here