ఏడు నెలలు గ్యాప్ కావాలి తేల్చి చెప్పేసిన బాలయ్య ?

ఈ సంక్రాంతి సీజన్ కు జై సింహ సినిమాతో వచ్చి హిట్టు కొట్టిన నందమూరి బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. సీనియర్ హీరో అయిన బాలకృష్ణ సినిమాలు చేయడంలో ప్రస్తుతం ఉన్న యువ హీరోల కంటే చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు.

అయితే వున్నట్లుండి ఆయన ప్రస్తుత కెరీర్లో దాదాపు 7 నెలలపాటు అనుకోని విధంగా విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి కొంత రీసెర్చ్ జరగాల్సి ఉంది అంట దీంతో 7 నెలలు బాలకృష్ణ విరామం తీసుకుంటున్నట్లు సమాచారం. అలా చూస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో షూటింగ్ ఆరంభిస్తారని సమాచారం అందుతోంది.

దీన్ని బట్టి చూస్తే జనవరి నుండు ఆగష్టు చివరివరకు, అంటే ఈ 7 నెలలు విరామం రానుంది. ఈ గ్యాప్ లో బాలయ్య ఏమి చేస్తారు అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొని వుంది. బాలయ్య ఇంకో సినిమా చేస్తారా లేకపోతే రాజకీయాల్లో బిజీ అవుతారా అన ఆసక్తి అందరిలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here