పద్మావతి ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే

దీపికా పదుకునే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారులలో నటించినా పద్మావతి సినిమా దేశంలో అనేక సంచలనం సృష్టిస్తోంది. విడుదలకు ముందు వివాదాలకు అనేక దాడులకు గురైన ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడే కొద్దీ సినిమా మీద దాడులు మరింత ఎక్కువయ్యాయి.సెన్సార్ బోర్డుకి వెళ్లిన ఈ సినిమా అనేక కట్ల కు గురైంది.ఈ క్రమంలో సెన్సార్ సభ్యులకైతే ఈ చిత్రం తలకు మించిన భారంగా మారింది. ఓ దశలో ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా పద్మావతి సినిమా వీటినన్నిటినీ దాటుకుని జనవరి 26న విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

కాగా హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీమియర్ షో లు ప్రదర్శించారు. అయితే ఇప్పుడు పద్మావతి ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం .చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథగా ఈ సినిమాను దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించాడు. మహారాణి పద్మావతి మరియు సుల్తాన్ అల్లా వుద్దీన్ ఖిల్జీల కథ ఇది. సినిమాలో ఎమోషన్స్ ,విజువల్స్ తో దర్శకుడు మరో సారి తన ప్రత్యేకతని చాటుకున్నారు.ప్రధాన పాత్రల్లో నటించిన దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ మరియు రణవీర్ సింగ్ ల నటన ఆకట్టుకునే విధంగా ఉంది.

ముఖ్యంగా అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ జీవించాడు. అతడి నటన సినిమాకి ప్లస్ హైలైట్. సినిమాలో యుద్ధ సన్నివేశాలలో  మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో బాహుబలి తో పోల్చుకుంటే మాత్రం నిరాశ తప్పదు. మొత్తగా పద్మావతి చిత్రం తెలుగులో యావరేజ్ సినిమాగా మిగిలిపోనుంది. పైన చెప్పుకున్న పాజిటివ్ అంశాల కోసం ఈ సినిమాని ఒకసారి చూసి ఆస్వాదించవచ్చు. పద్మావతి అనే చిత్రం పూర్తిగా ఉత్తరాది ప్రజల ఎమోషన్స్ తో ముడిపడిన చిత్రం. కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకుల ఈ చిత్రం బాగా నచ్చుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here