సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ – అనుష్క లవ్ అంటున్నారు !

హీరో ప్రభాస్ అనుష్క మధ్య ఏదో ఉందని అప్పట్లో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ రూమర్స్ ని ప్రభాస్ అనుష్క ఎప్పుడో కొట్టిపారేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా మళ్లీ వీరిద్దరి మధ్య మ్యాటర్ నడుస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేయడం జరుగుతుంది. అనుష్క లేటెస్ట్ సినిమా భాగమతి రిలీజ్ అవుతున్న తరుణంలో మళ్లీ ఈ గాసిప్స్ బయటకొచ్చాయి. ఇవి ఏవో కాకతాళీయంగా వచ్చినవి కాదని.. అదో పబ్లిసిటీ స్టంట్ అన్నది లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.
భాగమతి సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అవుతోంది. ఈ టైంలో ఆ సినిమా ప్రమోషన్ కోసమే మళ్లీ ఈ రూమర్స్ ను తెరమీదకి తెచ్చారని.. సింపుల్ గా ఇదో పబ్లిసిటీ స్టంటని ప్రభాస్ – అనుష్కల కామన్ ఫ్రెండ్ ఒకరు క్లారిటీగా చెప్పుకొచ్చాడు. బాహుబలి జోడి కాబట్టి ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి అని దీనివల్ల భాగమతి అనేక భాషలలో విడుదలవుతున్న నేపథ్యంలో లాభాలు దండుకోవాలని ఈ రూమర్స్  పుట్టుకొచ్చాయని కొందరంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here