భారత్, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

భారత్, చైనా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. మాటల యుద్ధం మరింత ముదురుతోంది. చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది డ్రాగన్ కంట్రీ. హిందూ మహా సముద్రంలోకి తమ జలాంతర్గామిని పంపి దుస్సాహసానికిదిగుతోంది. సిక్కిం సరిహద్దుల్లో డోకా లా ప్రాతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా చైనా మరో దుస్సాహసానికి దిగింది. హిందూ మహాసముద్రజలాల్లోకి తనజలాంతర్గామిని పంపి ఉద్రిక్తతలను రాజేస్తోంది చైనా.
సబ్‌మెరైన్‌కు సపోర్ట్‌గా చైనా యుద్ధ నౌక ఛాంగ్‌మింగ్డవోను మోహరించింది. హిందూ సముద్ర జలాల్లోని సౌత్ బ్లాక్‌ నుంచి వీటి కదలికలను భారత్ నిశితంగా గమినిస్తోంది. మూడేళ్ల క్రితం 2013-14లో చైనా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు హిందూ మహాసముద్రంలో కనిపించాయి. తాజాగా హిందూ మహాసముద్రంలో కనిపించిన సబ్‌మెరైన్ యువాన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్‌మెరైన్‌గా గుర్తించారు. 2013 డిసెంబర్ నుంచి ఇంతవరకూ 7 సబ్‌మెరైన్లు హిందూ మహాసముద్ర జలాల్లో కనిపించాయి.
ఐవోఆర్‌లో గస్తీ కాస్తున్న ఇండియన్ నేవల్ ఉపగ్రహమైన రుక్మిణి గత రెండునెల్లలో ఐవోఆర్‌లో చైనాకు చెందిన 13 యద్ధ నౌకలను గుర్తించింది. వీటిలో అత్యంత శక్తిమంతమైన లుయాంగ్-3 క్లాస్ గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్ కూడా ఉన్నట్టు నావికాదళ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా హిందూ సముద్ర జలాల్లో కనిపించిన యువాన్ క్లాస్ కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ పాతబడిన భారత్ సబ్‌మెరైన్ కంటే మెరుగైంది.
 డోకా చైనాదేనని జవహర్ లాల్ నెహ్రూ కూడా అంగీకరించాడని చైనా అంటుండగా.. 1962లో ఉన్నప్పటి భారత్ కాదంటూ అరుణ్ జైట్లీ ధీటుగా జవావిచ్చారు.. ఇప్పటి చైనా కూడా వేరు అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగు షువాంగ్ హెచ్చరించారు.. ఇక  హిందూ మహాసముద్ర జల్లాల్లో చైనా జలాంతర్గామి, యుద్ధ నౌకల మోహరింపు పరిస్థితి తీవ్రతకు మరింత పెంచుతోంది. చైనా దూకుడును నిశితంగా పరిశీలిస్తున్న భారత్ దీటైన జవాబు చెప్పేందుకు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here