శశికళ, జయలలితల దారిలో ఎన్టీఆర్..?

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ   మరో బాంబ్ పేల్చాడు.. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ ను తీయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు.వర్మ తీసే సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ లా నటించబోతున్నాడు.. మరి వర్మ మూవీ ఎలా ఉంటుంది?   వివాదాల వర్మ మరో వివాదానికి తెర లేపుతున్నాడు.. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడిరాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి,నందమూరి తారక రామారావు బయోపిక్ ను తీయాలని నిర్ణయించు కున్నాడు.. వర్మ ఏం చేసినా సంచలనమే.. నిజ జీవిత గాధలను తెరకెక్కించడంలో వర్మ ఎక్స్ పర్ట్..
అయితే వర్మ తీసిన ప్రతీ చిత్రం చివర్లో కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేయడం ఖాయం.. ఏ సినిమా తీస్తున్నా.. దాని గురించి జనంలో టాక్ బాగా నడిచేలా ప్లాన్ చేసుకోవడంలో వర్మను మించిన వారు లేరు.. బయోపిక్ లు, యదార్ధ గాధలు తీసేముందు సంబంధిత కుటుంబాలను కలసి కీలక విషయాలు తెలుసు కోవడమూ అలవాటే..అలాగే ప్రతీసారీ తెలుగులో ఇక సినిమాలు చేయను చేయను అంటూనే ఒక్కో సినిమా చేయడం కూడా వర్మకు అలవాటే.. రక్త చరిత్ర సినిమా తో అందరినీ మెప్పించిన వర్మ..
ఆతర్వాత వంగవీటి సినిమా తో మాత్రం వివాదాల కేంద్రంగా మారారు.. మై సన్నీ లియోన్ బన్నా చాహతాహూ అంటూ ఆడవారిపై మరో సెన్సేషన్ షార్ట్ ఫిలింతో మహిళల విమర్శలు ఎదుర్కొన్నాడు.. అలాంటి వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు.. మరీ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ప్రతీ అంశాన్ని వర్మ ఉన్నదున్నట్లు చూపిస్తాడా? నిజాలు నిర్భయంగా బయటపెడతాడా? ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ రాణిస్తారా? ఎన్టీఆర్ జీవితమంతా ఒక ఎత్తు.. చివరి రోజుల్లో ఆయన జీవితం మరో ఎత్తు.
రాజకీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య నడిచిన సంఘర్షణను వర్మ ఎలా ప్రొజెక్ట్ చేస్తాడు? ఒక మహిళ కేంద్రంగా నడిచిన రాజకీయాన్ని..  ప్రభుత్వ పతనానికి జరిగిన మాస్టర్ ప్లాన్ ను ఎలా ఆవిష్కరిస్తాడు? ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలివే.. నందమూరి బాలయ్య, వర్మ ఇద్దరూ ఇద్దరే.. మరి వీరి కాంబినేషన్ లో మూవీ పూర్తవుతుందా? వర్మ అందరినీ మెప్పిస్తాడా? గతంలో శశికళ, జయలలితల బయోపిక్ తీస్తానంటూ ప్రకటించినా ఆపై వాటి అతీ గతీ లేదు.. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here