కొడనాడు ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్న జయలలిత ఆత్మ

కొడనాడు ఎస్టేట్ తో సంబంధమున్న వారంతా ఎందుకు చనిపోతున్నారు…? రోడ్డు ప్రమాదాలు, బలవన్మరణాలు నిజమైనవేనా…ఎవరి హస్తమైనా ఉందా..? జయ ఆస్తుల కోసమే ఇదంతా చేస్తున్నారా..? లేక సోషల్ మీడియాలో వదంతుల్లాగా జయలలిత ఆత్మ కొడనాడు ఎస్టేట్ చుట్టూ తిరుగుతు ఇలాంటి ఇన్సిండెంట్లను క్రియేట్ చేస్తుందా.లేక మన్నార్ గుడి మాఫియా పనే ఆనే ఆరోపణల్లో నిజం ఉందా..?
 నీలగిరి జిల్లాలో ఉన్న కొడనాడు ఎస్టేట్ లో వంద గదుల బంగళా, బంగళా చుట్టూ విద్యుత్‌ కంచెల ప్రహారీ, అన్ని వైపులా సీసీ టీవీ కెమెరాలు…శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది….ఈ బంగళా. ఈ ప్రాంతమంటే జయకు అమితమైన ఇష్టం. ఆమె ఏడాదికి రెండు నెలల పాటు ఇక్కడే ఉండేవారు. అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడి నుంచే పాలన కొనసాగించేవారు. ఈ బంగళాలోకి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, పనిమనుషులు, కారు డ్రైవర్లు తప్ప మరెవ్వరూ లోపలికి వెళ్లే పరిస్థితులు లేవు.
జయలలిత కీలకమైన దస్తావేజులను , ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఇక్కడే భద్రపరిచారనే వార్తలున్నాయి. అమ్మ మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్‌, బంగళా చిన్నమ్మ వశమయ్యాయి. ఆ తర్వాతే అనుమానాస్పద ఘటనలు ప్రారంభమయ్యాయి.
అనుమానాస్పద మరణాలకు కేంద్రబిందువైన కొడనాడు ఎస్టేట్ విలువ దాదాపు వెయ్యి కోట్లు. కొడనాడు ఎస్టేట్‌ ఎవరి పేరు మీద ఉందన్నది ఇప్పుడు అంతుచిక్కడం లేదు. కానీ శశికళ అక్క కొడుకు దినకరన్‌ పేరు మీద ఉందని తెలుస్తోంది.
జయకు వారసులు ఎవరూ లేరు. పైగా ఎవరి పేరు మీదా వీలునామా రాయలేదు. కాబట్టి, ఎవరికివారు ఆస్తులను దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అందులో భాగమే…కొడనాడు ఎస్టేట్‌కు సంబంధించి వరుస మరణాలు. జయ ఆస్తులే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 జయ మరణంపై మిస్టరీ కొనసాగుతుండగానే ఇప్పుడు ఆస్తుల చుట్టూ అనుమానాస్పద మరణాలు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తుయిన్నారో అర్థంకాని పరిస్థితి. దీనిపై తమిళనాడు ప్రజల్లో అనేక సందేహాలు. తమ ప్రియతమ నాయకురాలిని నిజంగా ఎవరైనా చంపేశారన్న సందేహాలు ఒకవైపు వేధిస్తుంటే,… సోషల్ మీడియాలో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తనకెంతో ఇష్టమైన కొడనాడు ఎస్టేట్ తో సంబంధాన్ని తెంచుకోక…ఎస్టేట్ ను నాశనం చేసేందుకు జరుగుతున్న కుట్రల్ని తిప్పికొట్టేందుకు అమ్మ ఆత్మరూపంలో తిరుగుతుందంటూ వందతులు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఆమె ఆస్తుల కోసం జరుగుతున్న మిస్టరీ మర్డర్‌లు, జనాలను బాధపెడుతున్నాయి. అయితే ఎవరు  చేశారు…ఎవరు చేయిస్తున్నారనేది పోలీసుల విచారణలోనే తేలాలి. మరి ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయా…లేకపోతే చరిత్రలో క్వశ్చన్ మార్కులా మిగిలిపోతాయా అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here