సుకుమార్.. ‘అది’ దించేస్తాడట.. ‘అక్కడ’ వేసేస్తాడట!

సుకుమార్ స్టయిలే వేరు. దర్శకత్వం వహించినా.. నిర్మాతగా సినిమా తీసినా.. తన స్టయిల్ ఆఫ్ మార్క్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటాడు సుక్కూ. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేయబోతోంది.. సుకుమార్ నిర్మాతగా రాబోతున్న కొత్త సినిమా. తను వృత్తి రీత్యా దర్శకుడు అయినా.. నిర్మాతగా మారి.. దర్శకుడు అన్న టైటిల్ తో సినిమా తీయడమే ఓ వెరైటీ. అలాంటి సినిమాలో.. తన కైండ్ ఆఫ్ స్టయిల్ తో.. ఓ పాట కూడా ప్లాన్ చేశాడు.

ఆకాశం దించేస్తా.. మేఘాల్లో సెట్ వేసేస్తా.. అంటూ డిఫరెంట్ గా పాటను రాయించాడట. మామూలుగా అయితే.. టైటిల్ కార్డ్ నుంచి పాటల షూటింగ్ వరకూ.. సుక్కూ స్టయిల్ కనిపిస్తుంటుంది. ఈ పాటలో.. అంతకంటే ఎక్కువగా.. ఎంటర్ టైన్ మెంట్ ను జోడిస్తున్నాడట. దాంతో.. సుకుమార్ ఫ్యాన్స్ లో అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది.

కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాతగా తన టేస్ట్ లో ఉన్న మజాను.. ఫ్యాన్స్ కు రుచి చూపించిన సుక్కూ.. ఇప్పుడు దర్శకుడు సినిమాతో.. మరింత సక్సెస్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here