మరొక గబ్బర్ సింగ్ రేంజ్ సినిమాకి ప్లాన్ చేసిన దిల్ రాజు

దిల్ రాజు కీ ఆయన ప్రొడక్షన్ హౌస్ కీ ఆస్థాన దర్శకుడు ఇప్పుడు హరీష్ శంకర్. రామయ్య వస్తావయ్యా సినిమా ప్లాప్ ఇచ్చినా కూడా దిల్ రాజు హరీష్ కి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాకి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకి మంచి లాభాలు రావడం తో ఈ సారి అల్లూ అర్జున్ డేట్ లు సంపాదించి హరీష్ చేతిలో పెట్టాడు. శంకర్ కూడా సేఫ్ గేమ్ ఆడి ప్లాప్ అవ్వకుండా దువ్వాడ సినిమా విడుదల చేసి మంచి లాభాలు తెప్పించాడు.

 

బయ్యర్ ల సంగతి పక్కన పెడితే దిల్ రాజుకి మంచి లాభమే ముట్టింది. ఎప్పటి నుంచో హరీష్ తో నాల్గవ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు ఇప్పుడు హరీష్ కి ఏ హీరోతో డేట్స్ ఇవ్వాలా అని చూస్తున్నాడు. ఎన్టీఆర్ , మహేష్ , కళ్యాణ్ అందరూ బిజీ గానే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచొ సినిమా చెయ్యాలని చూస్తున్న దిల్ రాజు ఈ చిత్రానికి గాను డేట్స్ అడిగే ప్రయత్నాలు చేస్తున్నాడు అని టాక్. అంతా వర్క్ అయితే మరొక గబ్బర్ సింగ్ షురూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here