నన్ను నా మొగుడు , అత్తా మామా ఇంట్లోకి రానివ్వడం లేదు – హీరోయిన్ ఏడుపు

బాలీవుడ్ నటి మోడల్ అయిన కరీమ బిగ్ బాస్ కొత్త షో లో పార్టిసిపెంట్ గా కూడా అందరికీ పరిచయం. అతని భర్త గౌరవ్ గుప్తా మీద ఆమె గృహ హింస కేసు పెట్టడం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ ” సరిగ్గా ఏడు వారాల క్రితం నన్ను నా మొగుడు అత్తవారి ఇంటి నుంచి గెంటేసారు .. మా ఆయన కి మా అత్తా మావా సహకరించారు.
ఆ తరవాత రాజీ పడ్డం కోసం నేను చాలా ప్రయత్నాలు చేసాను కానీ మా అత్తా మావా నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు. గౌరవ్ కూడా నాతో కాంటాక్ట్ లో ఉండడం మానేసాడు” అని ఆమె కంట్లో నీళ్ళు పెట్టుకుని  ఆరోపిస్తున్నారు. గత ఏడాది జనవరి లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆరు నెలలు తిరక్కుండానే ఇద్దరి మధ్యనా గొడవలు మొదలు అయ్యాయి. హిందూ మతానికి మారాలి అంటూ తన మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మానసికంగా వేధించి క్షోభకు గురిచేశాడని, వివాహానంతరం మోడలింగ్, నటనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశాడని, అభ్యంతరమేంటని అడిగితే ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఆమె తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here