ఫస్ట్ పవన్ కళ్యాణ్ ని వేస్ట్ గాడు అన్నాడు .. ఇప్పుడు అల్లూ అర్జున్ ని బూతులు తిడుతున్నాడు

బాలీవుడ్ విమర్శకుడు, కాంట్రోవర్సి లు అంటే పడి చచ్చే కేఆర్కే అటు బాలీవుడ్ హీరోలతో పాటు ఇతర ఇండస్ట్రీ హీరోల మీద కూడా ఏదో ఒక పిచ్చి వాగుడు మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల టైం లో ఆ చిత్రం హిందీ లో డబ్బింగ్ చేస్తున్నారు అని తెలిసి చాలా విమర్శలే చేసాడు అతను. పవన్ కళ్యాణ్ సినిమా కి హిందీ లో మినిమం వసూళ్లు కూడా రావు అనీ అతను ఎవరో కూడా అక్కడ వాళ్లకి తెలీదు అనీ అనరాని మాటలు అన్నాడు.

 

పవన్ ఫాన్స్ తో కుక్క తిట్లు తిట్టించుకున్నా కూడా కొన్నాళ్ళు సైలెంట్ ఉండి ఆ తరవాత బాహుబలి 2 చిత్రాన్ని దారుణంగా విమర్శించాడు. అదొక పనికిమాలిన సినిమా అన్న కేఆర్కే కలక్షన్ లు వచ్చిన తరవాత ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా అల్లూ అర్జున్ ఫోటో ని తన ట్విట్టర్ లో పెట్టి లుక్కా అంటూ ఏడిపించాడు ఇతను. హిందీ సినిమాలో కామెడీ వేషాల కీ సరదా సన్నివేశాల్లో హీరో పక్కన సరిపోయే లా ఉన్నాడు అంటూ అల్లూ అర్జున్ ని ఎద్దేవా చేసాడు. అల్లూ సైన్యం మళ్ళీ ఇతని మీద ట్విట్టర్ లో విమర్సల జడివాన కురిపిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here