ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే .. బ్రహ్మానందం కెరీర్ మంగళం !

టాలీవుడ్ లో ఒక కొత్త వార్త హల్చల్ చేస్తోంది. సీనియర్ కమీడియన్ బ్రహ్మానందం లీడ్ రోల్ గా కత్తి రెడ్డి అనే సినిమా రాబోతోంది అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఎత్తితే దించడు అనే క్యాప్షన్ ని కూడా జత చేసారు. యాంకర్ రవి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాడట. రవి మినిమం హీరోగా బ్రహ్మీ పూర్తి స్థాయి హీరోగా చేస్తారట. బ్రహ్మానందం లీడ్ రోల్ లో సినిమా అంటే అదేమీ మనకి కొత్త కాదు అప్పట్లోనే బాబాయ్ హోటల్ అనే సినిమా తీసిన బ్రమ్మీ పరవాలేదు అనిపించాడు. ఆ తరవాత అరా కోరా సినిమాలు ఇతర స్టార్ ల పక్కన చేసాడు.

 

సరిగ్గా సూపర్ డూపర్ హిట్ రేంజ్ లో ఉన్న టైం లో జఫ్ఫా అనే సినిమా చేసి డిజాస్టర్ మూట గట్టుకున్నాడు బ్రమ్మీ. ఆ సినిమా వచ్చిన టైం లో ఆయన టైం చాలా పాజిటివ్ ఉంది కానీ చేతిలో ఉన్న సినిమాలు వదులుకుని ఈ చిత్రం చేసి కెరీర్ సర్వనాసనం చేసుకున్నాడు .ఇప్పుడు బ్రహ్మి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు బ్రహ్మి లేని పెద్ద సినిమా ఏదైనా వస్తే ఆశ్చర్యపోయేవాళ్లు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనపడ్డం లేదు. సో ఇలాంటి కీలక టైం లో సినిమాలు కూడా లేని పరిస్థితి లో ఇలాంటి స్క్రిప్ట్ లు ఓకే చెప్తే కెరీర్ కి మంగళం పాడడం గారంటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here