కారెక్కిన విష్ణు ప్రియ..!

తెలుగు బుల్లి తెరపై తనదైన ఎనర్జిటిక్‌ యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది యాంకర్‌ విష్ణుప్రియ. కెరీర్‌ తొలి నాళ్లలో కొన్ని సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్న ఈ చిన్నదీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ బ్యూటీ. మరీ ముఖ్యంగా మోడ్రన్‌ డ్రస్‌లలో హాట్‌ హాట్‌ ఫొటోలకు పోజుచ్చే విష్ణు ప్రియా ఆ ఫొటోలతో యువతను గిలిగింతలు పెట్టిస్తుంటుంది.

తాజాగా అలాంటి హాట్‌ ఫొటోనే ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసిందీ చిన్నది. పొట్టి స్కర్ట్‌లో, వైట్‌ షర్ట్‌ వేసుకున్న ప్రియా కారుపై కూర్చొచి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇక షర్ట్‌ పై బటన్‌ విప్పిన విష్ణు ప్రియ తన హాట్‌నెస్‌ మరికాస్త పెంచింది. దీంతో ఈ ఫొటో చూసిన వారంతా లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను 60వేలకి పైగా లైక్‌ చేయడం విశేషం. మరి విష్ణు ప్రియ ఈ హాట్‌ అందాలపై మీరూ ఓ లక్కేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here