82 ఏళ్ల వయసులో.. విశాల్ తండ్రి ఫిట్ నెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. !

తమిళ హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్రముఖ ప్రొడ్యూసర్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 82 ఏళ్లు.. అయితే ఆయన ఫిట్ నెస్ కి సంబంధించిన ఓ వీడియోని చూస్తే మాత్రం.. ఆయన వయసు 40 అన్నా నమ్మేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

‘అందరికీ నమస్కారం’ అంటూ వీడియోని మొదలు పెట్టిన జీకే రెడ్డి. ఇంట్లోనే  చేసుకోదగిన కొన్ని వ్యాయామాలను చేసి చూపించాడు. ఇక ఈ వీడియో చూసిన వారు ఈ వయసులో ఏం ఫిట్ నెస్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జీకే రెడ్డి ఇటీవలే కరోనాను జయించాడు. 82 ఏళ్ల వయసులో కరోనాను అధిగమించిన జీకే రెడ్డి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here