భారత్‌కు ప‌దికోట్ల క‌రోనా డోసులు.. ర‌ష్యా అంగీకారం

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్ర‌పంచ దేశాలు కుస్తీలు ప‌డుతున్నాయి. తాజాగా ర‌ష్యా త‌యారు చేసిన వ్యాక్సిన్ భార‌త్‌లో ప్ర‌యోగాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. ఇండియాలో ట్ర‌య‌ల్స్‌తో పాటు ప‌ది కోట్ల డోసులు ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. భార‌త ఫార్మా దిగ్గ‌జం డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ర‌ష్యా ఒప్పందం కుదిరింది.

ఇక ర‌ష్యా వ్యాక్సిన్ స్నుత్నిక్ వి ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త్ కూడా ర‌ష్యాతో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. మొద‌ట్లో క‌రోనా వ్యాక్సిన్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌యిన‌ప్ప‌టికీ మొద‌టి రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించిన ప్ర‌యోగాల త‌ర్వాత దీనిపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. నియంత్ర‌ణ సంస్థ‌ల నుంచి అనుమ‌తులు రాగానే ప‌ది కోట్ల డోసుల‌ను డాక్ట‌ర్ రెడ్డీస్‌కు అందించే ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని ర‌ష్యా తెలిపింది. ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మ‌య్యాక‌.

అనుమ‌తుల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే వీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. ఇక భార‌త్‌కు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ర‌ష్యాతో క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంద‌ని డాక్ట‌ర్ రెడ్డీస్ కోచైర్మ‌న్ జీ.వి ప్ర‌సాద్ అన్నారు. వ్యాక్సిన్ విజ‌య‌వంతంగా పనిచేస్తుంద‌ని తొలి రెండు ద‌శ‌ల ప్ర‌యోగాలను బ‌ట్టి తెలుస్తుంద‌న్నారు. భార‌త్‌లో మూడో ద‌శ ప్ర‌యోగాల‌ను తాము చేప‌డతామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here