ఆకట్టుకుంటున్న కమల్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

భారతదేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ కూడా ఒకరు. నటనకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించే కమల్ హాసన్. తన సినిమాల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంటాడు. అయితే ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కమలహాసన్.. తాజాగా వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్

సొంత సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. తమిళనాట ‘అవాల్’, ‘మా నగరం’ ‘ఖైదీ’ చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇది కమలహాసన్ నటిస్తున్న 232వ చిత్రం కావడం విశేషం.

‘Once Upon A Time There Lived A Ghost’ అంటూ వివిధ రకాల గన్స్ తో ఉన్న సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్నాడు. సినిమాను 2021 వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here