అనారోగ్యంతో తిరుప‌తి ఎంపీ మృతి..

ఏపీలో అనారోగ్యంతో ఓ ఎంపీ మృతిచెందారు. వైసీపీ నేత‌, తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ (64) చ‌నిపోయారు. క‌రోనాతో చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయ‌నకు ఇటీవ‌లె నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంతో ఆయ‌న‌ మృతి చెందారు. ఈయ‌న స్వ‌స్థ‌లం నెల్లూరు జిల్లా నాయుడు పేట మండ‌లం భీమ‌వ‌రం.

శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా గూడురు నుంచి ఆయ‌న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. సుధీర్ఘ కాలం ఈయ‌న తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు. 1996.98 మ‌ధ్య తెలుగు దేశం ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు.  ఇక 2014 ఎన్నిక‌ల్లో దుర్గా ప్ర‌సాద్‌ను కాద‌ని చంద్ర‌బాబు నాయుడు బ‌త్తుల రాథాజ్యోత్స ల‌త‌కు టికెట్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు గూడూరు ఎమ్మెల్యే సునీల్ టిడిపిలోకి వెళ్ల‌డంతో దుర్గా ప్ర‌సాద్‌ వైసీపీలో చేరారు.

తిరుప‌తి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ‌ర ప్ర‌సాద రావుకు గూడూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దుర్గా ప్ర‌సాద్‌కు తిరుప‌తి ఎంపీ స్థానం కేటాయించారు. దీంతో దుర్గా ప్ర‌సాద్ ఎంపీగా గెలుపొందారు. ఏడాదిన్న‌ర లోపే ఆయ‌న మృతిచెంద‌డం బాధాక‌ర‌మైన విష‌యం. ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు విషాధంలో ఉన్నారు. దుర్గా ప్ర‌సాద్ మృతికి సీఎం జ‌గ‌న్ సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here