నేను దర్శకత్వం చేయట్లేదు…

కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఇటీవల దర్శకుడిగా మారనున్నట్లు ఓ వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ తెలపడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అన్ని వార్తా పత్రికలు, వెబ్ సైట్ లలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా నిఖిల్ మరోసారి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తాను దర్శకత్వం వహించడం లేదని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసిన నిఖిల్..

‘ఓ చిల్డన్స్ ఫిలిం కోసం మేమంతా కలిసి ఓ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాం. అయితే నేను డైరక్ట్ చేయబోవడం లేదు. ఎందుకంటే అక్టోబర్-నవంబర్ నుంచి నా రెండు సినిమాలు హెవీ షెడ్యూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు ఇలా తను దర్శకత్వం వహించడం లేదనే విషయాన్ని స్వయంగా ప్రకటించాడు నిఖిల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here