హాట్ స్టార్ లో ‘లక్ష్మీబాంబ్’.. 

థియేటర్లు మూత పడటంతో చాలా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీ పై పడింది. మరీ ముఖ్యంగా ఎక్కువ సినిమాలు విడుదలయ్యే బాలీవుడ్ పై ఈ ప్రభావం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై విడుదల చేస్తున్న నేపథ్యంలో. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ దారిని ఎంచుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో  తెరకెక్కిన కొన్ని సినిమాలు ఆన్ లైన్ వేదికగా విడుదలయ్యాయి.

తాజాగా ఈ జాబితాలోకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన లక్ష్మీ బాంబ్ కూడా వచ్చి చేరింది. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచన చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించారు. ఈ సినిమాను “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో విడుదల చేయనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మూడు చాలెంజింగ్ పాత్రల్లో  నటిస్తుండగా.. హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here